పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

232

దూరముగా, ఏకాంత వాసముచేయుచు ధ్యాన సాధనలును ఎన్నిసంవత్సరములో సాగించియున్నాడు. కావున గృహస్థులు ఏకాంత స్థలములందుచేరి, అప్పుడప్పుడు మూడేసి దినములైనను, భగవత్సాక్షాత్కారము పొందునిమిత్తము, సాధనలు చేయుచుండుట చాలమేలు గూర్చును!

654. "లోకము భగవంతునిది; నాదికాదు" అని కృతనిశ్చయుడవై యుండుము. "నేను, వాని ఆజ్ఞలను చెల్లించుటకై ఏర్పడిన వాని సేవకుడను మాత్రమే!" అనుట మఱవకుము.