పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35వ అధ్యాయము.

లోకవృత్తము - ఆధ్యాత్మికత

655. ఒక సేద్యగాడు దినమంతయు తన చెఱుకుతోటకు నీరు తోడుచుండెను. తన పనిని ముగించిచూడగా ఒక్క చుక్క నీరైనను తోట కెక్కలేదని తెలియవచ్చెను. నీరంతయు ఎలుకలకలుగులగుండ నేలలోనికి పోయినది. తన హృదయమున రహస్యముగా కీర్తికొఱకును, సుఖముల కొఱకును, సౌకర్యముల కొఱకును భూరిసంపదల కొఱకును, గొంతెమ్మ కోరికలను పెంచుకొనుచు, భగవదారాధనలు చేయు భక్తునిస్థితి పైనిచెప్పిన సేద్యగాని స్థితిని బోలియున్నది. అతడు ప్రతిదినము ప్రార్థనలు చేయుచున్నను పురోభివృద్ధి కాంచడు. వానిభక్తియంతయు కోరికలనెడు ఎలుకల కలుగుల ద్వారమున వ్యర్ధమై పోవుచుండును. తనజన్మాంతము వఱకు ఇట్టిభక్తి చేయుచున్నను ఆతడు ఎప్పటియట్లేయుండును, కాని అభివృద్ధి పొందజాలడు.

656. ప్రశ్న:- ధ్యానమందుండగా మనస్సు చంచలించుటకు కారణమేమి?

ఉ:- మిఠాయిఅమ్మువాని దుకాణములో పెట్టియుంచిన మిఠాయిమీద ఈగలు వ్రాలియుండును. కాని పాకివాడొకడు అశుద్ధపుతట్ట తీసుకొని ఆత్రోవననురాగానే, ఈగలు మిఠాయిని విడిచివేసిపోయి అశుద్ధముపైనివ్రాలును. కాని