పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

231

34వ అధ్యాయము.

వారికితెలిసిపోయినది. భగవద్భక్తిచేత వారిహృదయముల నుండి వెల్లివిరిసివచ్చు ఆనందబాష్పముల పారవశ్యముతో పాయసములు తులరావయ్యె! ఆత్మానంద పారవశ్యమున నిలువలేక పడిపోయి భూమిని కౌగలించుకొనుటే, వయ్యారంపుయువతుల కౌగిలింతలనుమీరు ఆనందమని వారికి తెలియవచ్చెను.

651. బయటికిపోయి శత్రువు నెదిరించి పోరుటకు పూర్వము యోధులు తమ నివాసముల చెంతను, బహిరంగ యుద్ధరంగమునవాటిలుఅపాయములు లేనితావున, రణకౌశలమును నేర్చుకొందురు. అటులనే సన్యాసాశ్రమపు కఠిన నిష్ఠలను పూనుటకు పూర్వము, మీ ఆత్మోన్నతిని గడించుటకు, గృహస్థ జీవనపు సౌకర్యములను వినియోగించుకొనుడు.

652. నీవు గృహజీవనమును విడిచి సన్యాసివైనను, సంసారివై యుండినను, ఒక్కటియే - నీహృదయమును మాత్రము భగవంతునిపై స్థిరముగ నిలుపుము చాలును. ఒక చేతితో నీగృహస్థ ధర్మములను నిర్వహించుము; రెండవ చేతితో స్వామి పాదముల బట్టుము. గృహకృత్యములు నీకు లేనప్పుడు నీరెండు చేతులతోడను భగవంతుని పాదములను హృదయమున నద్దుకొనుము.

653. గృహస్థుడు సయితము భగవంతుని సాక్షాత్కారము పడయవచ్చును. జనక మహారాజును చూడుడు, అతడు రాజఋషి. కాని ఆకస్మికముగా జనకరాజువంటి వారగుట పొసగదు. జనకమహారాజు లోక వ్యవహారాడంబరములకు