పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

207

30వ అధ్యాయము.

జవాబు:- ఆత్మజ్ఞానమును పొందగనే సకలబంధములును వాటంతటవియే రాలిపోవును. ఆపిమ్మట వీడు శూద్రుడనియు, వీడుబ్రాహ్మణుడనియు, వీడుత్తమజాతివాడనియు, వీడు అధమజాతివా డనియు తారతమ్యములుండజాలవు. కావున కులాధిక్యతకు చిహ్నమగు జంద్యమును దానంతట అదియే రాలిపోవును. కాని ఒకనికిభేదములు ఎచ్చుతగ్గులు స్ఫురించునంత వఱకును వానిని ఆతడు బలాత్కారముగా త్రోసిపుచ్చరాదు.

590. తప్పత్రాగినవాడుచొక్కాను ఒక్కొకప్పుడు తలకుచుట్టుకొనుచు, ఒక్కొకప్పుడు కాళ్లకుతొడుగుకొనుచు నుండుతీరున బ్రహ్మావేశితపురుషుడు బాహ్యప్రపంచజ్ఞానముం గోల్పోయి వర్తించును.

591. పుండు మానిపోయిన అనంతరము పొక్కు దానంత నది రాలిపోవును. అంతదాక ఆగక యాపొక్కును బలాత్కారముగ లాగివేసితిమా, నెత్తురుకారనారంభించును. అటులనే బ్రహ్మజ్ఞానతేజము కలుగగానే కులభేదము వానంతట అవియే వీడిపోవును; కాని పామరులుగ నుండియు, అట్టిబేదములను తిరస్కరించుటతప్పు. అందువలన అనేకములగు అనర్ధములు పొసగును.

592. ఈకాలపునరులు ప్రతిదాని సారాంశమును తెలియగోరుదురు. వారికి మతమునందును సారమే కావలయునే కాని అప్రధానాంశములు వారికక్కఱలేదు. (క్రతువులు, కర్మలు, నీమములు, నోములు, ఏవియు పాటింపరు)