పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

208

593. మంచిముత్యమును గర్భమునందు తాల్చు ముత్తెపు చిప్పకు అంతగా విలువలేదు; కాని ఆముత్యము పరిపక్వమగుటకుగాను ఆచిప్ప చాల ప్రధానమైనదే! ముత్యమును దీసికొనిన నరునకు ఆచిప్ప వ్యర్ధమే కావచ్చును. అట్లే కర్మలు క్రతువులు బ్రహ్మపదవిని సాధించినవానికి అవసరములుకాక పోవచ్చును.

594. భగవన్నామోచ్చారణ చేయువారు పవిత్రులగుదురు. (దక్షిణేశ్వరమునకు దాపునగల) ఆర్యాధగ్రామమున కృష్ణకిశోరుడను జ్ఞానికలడు. ఆయన ఒకసారి బృందావనమునకు తీర్ధయాత్ర వెడలెను. ఒకనాడాయన యిటునటు తిరుగుచుండగా, నూతిదాపున నిలుచుండియున్న ఒకమనుష్యుని గాంచి తనకు కొంచెము నీళ్ళుతోడిపెట్టుమని అడిగెను. ఆ మనుష్యుడు తానొక మాలవాడననియు బ్రాహ్మణునకు నీరు తోడియిచ్చుటకు తగననియు చెప్పెను. "ఒకసారి భగవన్నామోచ్చారణ చేసి పావనుడవు కమ్ము" అని కృష్ణకిశోరు పలికెను. ఆమనుష్యుడటుల భగవన్నామమును ఉచ్చరించి, ఆయనకొఱకు నీరుతోడిపెట్టెను. ఆయన బహునిష్ఠాగరిష్ఠుడగు బ్రాహ్మణుడయ్యును ఆనీరు త్రాగినాడు! ఆయన విశ్వాసమెంత గొప్పదో!

595. ఒకపర్యాయము కృష్ణకిశోరు "నీవు ఎందులకు జందెము తీసివేసితివి? అని అడిగెను నాకీ (బ్రహ్మభావన) ప్రాప్తించినప్పుడు, అశ్వినీ జంఝామారుతము వీచినప్పటివలె (1864 సంవత్సరపు ఉప్పెనవలె) అన్నియు కొట్టుకొని