పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

10

అటులనే నరునకుకావలసినది వానిలో నుండనేయున్నది. అయినను దానికొఱకై వెతకులాడుచు అతడు ఇందందు తిరుగులాడుచున్నాడు.

35. మలినమనస్సు బ్రహ్మమునుదర్శింపజాలదనుట ---------యము. కాని శుద్ధమనస్సు అనగా నిర్మలబుద్ధి. అనగా బంధరహితాత్మ బ్రహ్మసాక్షాత్కారమును పడయగలదు. వాసనాత్మకబుద్ధి, అనగా పరిమేయమై బంధముగలిగి వికాసరహితమగు మనస్సు ఇంద్రియలోలత గలదిగాన, అనగా కామినీకాంచనవాంఛలచేత యీడ్వబడునదగుటవలన బ్రహ్మమును ఎఱుగజాలదు. ఈమనస్సు సుసాధనచేత పవిత్రమంతమై ఇంద్రియలాలనను బాపుకొనగలదు; ప్రాపంచికవాసనలను, ఈప్సితములను, బంధములను, తొలగించుకొని అఖండాత్మతోడ నైక్యమును పొందవచ్చును. పూర్వపు మహాఋషులు భగవత్సాక్షాత్కారమును పొందినది ఈవిధముననేకదా! అఖండాత్మ స్వరూపియగు భగవంతుని నిష్కలంకమగు మనస్సుతో వారు చూడగలిగిరి. ఆ నిష్కళంకమగు మనస్సునే అఖండాత్మ స్వరూపముగా తెలిసికొనగలిగిరి!

36. ప్రశ్న:- అఖండాత్మ తాను భిన్నభావమునుపొంది, ప్రత్యగాత్మగా భావించుకొను బ్రాంతియెటులజనించినది?

సమాధానము:- కేవలము తర్కముపైని ఆధారపడు అద్వైతవాది "నేనెఱుగను" అని సమాధానముచె