పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9

1 వ అధ్యాయము.

బోలిచూపట్టినది. అన్నియు మైనముతో నిర్మాణమైనవే, సర్వమును మైనమే !

30. సత్తును గ్రహించవలయుననిన చిత్తును ఆశ్రయింపుము.

31. "లీల" ద్వారమున "నిత్యపదార్థమును" తెలియ బ్రయత్నింపుము.

32. "ప్రపంచము వట్టిబూటకము" అనుట తేలికయే; కాని దాని అర్ధమే మో తెలియునా? కర్పూరమును వెలిగించినప్పుడు యేమియు మిగులుకుండుటవంటిది. కట్టెను గాల్చగా బూడిద మిగులుట వంటిదికూడకాదు. సదసద్విచారము ముగిసిన పిమ్మటనే సమాధి స్థితిలభించును. అప్పుడు నేను నీవు జగత్తు అనువాని గుర్తించుటేయెంతమాత్రమును పొసగదు.

33. భగవంతుడు బాహ్యమున ఎక్కడనో దూరముగ కాన్పించునంతవరకును అజ్ఞానమున్నట్లే. ఆభగవంతుడు లోపల సాక్షాత్కరించినప్పుడు అది సత్యజ్ఞానమగును.

34. ఒక్కడు అర్ధరాత్రముననిద్రలేచి చుట్టత్రాగకోరెను. వానికి దీపముకావలసివచ్చినది. కావున పొరుగుననున్న యింటికిపోయి తలుపుతట్టినాడు. ఒకరు తలుపుతీసి వాని కేమికావలెనని అడిగిరి. "నేను పొగత్రాగవలెను. కొంచెము దీపము నిచ్చెదవా?" అని అతడన్నాడు. అందుకా పొరుగువాడు "అబ్బా! నీకేమి మతిపోయెనా? నీవింత శ్రమపడివచ్చి యిట్టివేళమమ్ము నిద్రలేపితివే! అటుల వెలుగుచు నీచేతిలోనే లాంతరున్నదికదా! అనెను.