పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

8

జీవాత్మ, పరమాత్మాకారమున కెగిరిపోయి సమాధియందు లయముగాంచును.

26. అహంకారము నశించినప్పుడు జీవుడు సమసిపోవును. అంతటసమాధియందు బ్రహ్మసాక్షాత్కారము కలుగును. అప్పుడు బ్రహ్మానుభూతినిపొందునది, బ్రహ్మమే గాని జీవుడుకాదు.

27. ఒక్కటిని తెలిసికొంటివా నీకు అన్నియు తెలిసిపోవును. ఒక్కటికితరువాత సున్నలనుజేర్చినప్పుడు వందలు, వేలుఅనువిలువయేర్పడుచున్నది. కానిఆఒక్కటిని కొట్టివేశితివా ఏమియుమిగులదు. ఆఒక్కటియుండుటచేతనే అనేకమునకు విలువయేర్పడుచున్నది. ఒకటి మొదలు అనంతరము అనేకము. దేవుడుమొదలు, జీవుడు జగత్తు తదనంతరము!

28. నాకేమి కనబడునో తెలియునా? భగవంతుడే సర్వము నైనట్లు కాన్పించును. నరుడుగాని, యితరజంతువులుగాని తలలఊచుచు కాలుచేతులనుఆడించుచునుండు తోలుగప్పినబొమ్మలలాగు కాన్పించును. భగవంతుడే వానిలోపల నుండునది.

29. ఒక్కసారి నాకొక దృశ్యము కానవచ్చినది. ఒకేద్రవ్యము విశ్వరూపమునుధరించి సర్వజీవరాసులతోనిండి కాన్పించినది. మనుష్యులు, పశువులు, తోటలు, రోడ్డులు మున్నగునవి అన్నిటితో కూడియున్న మైనపు భవనమును