పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11

1 వ అధ్యాయము.

ప్పును. అపరోక్షానుభూతివలన లభించుసమాధానమొక్కటే తుదిపర్యవసానము కాగలదు.

"నే నెఱుగుదును" నేనెఱుగను" అనుచున్నంతవఱకును నీవొక పురుషుడవై యున్నటుల భావనచేయుచుందువు. అట్టిదశయం దున్నంతవఱకును, ఈభిన్నత్వమును యదార్ధమనియే నీవు అంగీకరింపవలయునేకాని ఇది భ్రాంతియన తగదు. వ్యక్తిత్వము తొలగిపోయినప్పుడు, సమాధిదశ యందు అఖండబ్రహ్మమును గూర్చినజ్ఞానము నీకు అలవడును.

అప్పుడుమాత్రమే భ్రాంతియా? భ్రాంతికాదా? యధార్థమా? యధార్థముకాదా? అను నిట్టి సమస్యలన్నియు సమసిపోజాలును.

37. ఆత్మ దేనిచేతను అంటబడునదికాదు. కష్టము, సుఖము, పుణ్యము, పాపము అనునవి ఆత్మను అంటజాలవు. కాని దేహమే తాననుకొనువానికి మాత్రము ఇవిఅంటుకొనును. పొగ గోడనే మలినముగావించగలదుగాని అందుండు ఆకాశమును మలినము చేయజాలదు.

38. జ్ఞానముగూర్చియు నిత్యానందముగూర్చియు ధ్యానము సల్పుడు; మీకును ఆనందములభించును; ఆనందము నిజముగా నిత్యమైనది దానిని అజ్ఞానము మూతవేసి కప్పిపుచ్చుచున్నది. ఇంద్రియములబంధము నీశుతగ్గిన కొలదిని, భగవద్భక్తి నీయందు ప్రవర్ధనము గాంచుచుండును.