పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

176

ద్భక్తిలో నిమగ్నమైనయతడు యింద్రియబోగములగూర్చి తలంపనైనంజాలడు సుమీ !

515. ఒక్కసారి దీపమును చూచినయనంతరముశలభము చీకటిని ఆశ్రయించునా?

అహో! ఎన్నడును ఒల్లదు; అది ఆజ్యోతిలోపడి నాశముపొందును!

అయినను భగవద్భక్తునివిషయమున యిది సత్యమనరాదు. ఆతనిని ఆకర్షించివేయు దివ్యజ్యోతి తగులపెట్టదు; చంపనుచంపదు. అది మాణిక్యపు కాంతివంటిది; దీప్తిమంతమయ్యును మార్ధవముగను, శీతముగను, శ్రమోసహారిగను నుండును. అది దగ్ధముచేయదు; హృదయమునకు శాంతిని ఆనందమును కూర్చును.

516. ఈ (సంసారలంపటపు) బేరగాండ్రు (క్షుద్రభోగములను) పుచ్చుపప్పునకై దేవులాడు చున్నారు. సంసార కల్మషమంటని అమలజీవులకు మాత్రమే భగవద్భక్తి దొఱకగలదు. వారికి ఒకేదృష్టి; స్వామి పాదారవిందములపై నిశ్చలముగ మదిని నిలుపుటే ఏకైకవాంఛ!

517. భగవంతునిగూర్చిన విజ్ఞానము విశ్వాసముతోపాటువర్ధిలుచుండును. విశ్వాసము కొఱవడుతావున అధిక విజ్ఞానమునకైచూచుట వెఱ్ఱిపని.

518. భోగవిషయవాంఛ తగ్గినకొలదిని భగవద్భక్తి పెంపొందుచుండును.