పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

175

25వ అధ్యాయము.

శిఖరమనగా సమాధియందు అఖండబ్రహ్మభావన అమరి, జీవాత్మ బాహ్యప్రపంచానుభవములచే చలింపనిస్థితి. మెట్లవరుసయన భౌతికప్రపంచము; మానవదృష్టికి ప్రదర్శితమగు అవ్యయబ్రహ్మముయొక్క నామరూపాత్మకమయిన స్వరూపాంతరమేయని శిఖరముంజేరునప్పుడు విదితమగును!

514. ప్రశ్న:- కండ్లకు గంతలుకట్టనిది సాధికలేని క్రొత్తగుఱ్ఱములు ఒక్క అడుగైన పెట్టవుగదా. నరుని చిత్తవృత్తులు అదిమిపట్టనిది బ్రహ్మదర్శనమగుట సాధ్యమా?

జవాబు:- బ్రహ్మమునుచేరుటకై నిత్యానిత్యవివేక పథానువర్తియై నడచు జ్ఞానయోగివిషయమున ఆమాట సత్యమే. జ్ఞాని యిట్లువచించును:- "ప్రత్యక్షముగ బ్రహ్మమును జూడగోరునతడు నిష్కల్మషుడు కావలయును. తన చిత్తవృత్తులన్నింటిని దహనము చేయవలయును. మొదటఆత్మ శిక్షణము; పిమ్మట బ్రహ్మజ్ఞానము!"

భగవంతుని, జేర్చు మరొకత్రోవకలదు. అదిభక్తి యోగము. ఒక్కసారి భగవద్భక్తి నరుని అంతరంగమున చొచ్చెనా - వాని పావననామగానముచే ఒక్కతడవభక్తుడానందముతో పులకాంకురముగలవాడయ్యెనా అహో! చిత్తనిరోధసాధనలు యింకేల? అట్టినిరోధము దానంతట అదియే చేకూరును సుమీ!

తీవ్రదుఃఖవేదనగల మానవుడు కయ్యములకు దిగుటకుగాని, విందులుగుడుచుటకుగాని, ఇతరములగు యింద్రియభోగము లనుభవించుటకుగాని, శక్తుడగునా? అటులనే భగవ