పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

177

25వ అధ్యాయము.

519. పావనగంగ జ్ఞాని హృదయమున సమస్థితిని పాఱుచుండును. వానికీసంసారమంతయు కలయై తోచును. ఆతడు సదా తనఆత్మలోనె నిమగ్నుడై యుండును. భక్తుని విషయ మటులుండదు. వానియందు పాటుపోటు కాన్పించుచుండును. వేర్వేఱు చిద్భావములతో అతడు నవ్వుచు, ఏడ్చుచు, ఆటలాడుచు, పాటలుపాడుచు నుండును. భక్తుడగువాడు భగవంతునియందు నిలయ మేర్పఱచుకొని, వాని సమక్షమున ఆనందము ననుభవించుచుండును. ఆదివ్యానంద సాగరమున పడి, ఈదులాడుచు నీటిలోని మంచుగడ్డ క్రిందికి పైకి మునుగుచు తేలుచు నుండురీతిని మునుకలు వేయుచు తేలియాడుచు నుండును.

520. హృదయమున భగవద్భక్తి వెల్లివిఱియగనే కర్మత్యాగము తానంతనదియే వచ్చును. ఎవరినిభగవంతుడు కర్మలచేయ సృష్టిచేసినాడో వారుకర్మలచేయుచుంద్రుగాక. కాలపరిపాకము వాటిల్లినప్పుడు నరుడు సమస్తమును త్యజించి, "రమ్ము! ఓమనసా! హృదయపీఠమున అధిష్ఠించియున్న దైవముకడ మనము ఇరువురమును జాగరణము చేయుదుముగాక!" అని పలుకగలడు.

భగవంతుని శరణుజొచ్చుము; లజ్జాభయములను విడనాడుము. నేభగవన్నామస్మరణ చేయుచు నృత్యముచేయు నెడల ఎవరేమనుకొందురో అను నిట్టిశంకలనన్నిటిని పాఱద్రోలుము.

521. ఈ భగవద్భక్తి కడునరుదగువస్తువు! పతివ్రతయగు స్త్రీకి తన పతిపైనుండునంతటి హృదయపూర్వకమగునట్టి