పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143

21వ అధ్యాయము.

కారణమేమని శ్రీపరమహంసులవారినిఅడిగెను. శ్రీ వారిటుల బోదించిరి.

"ఒకనికడ పెంపుడుకుక్కయుండెడిది. ఆతడు దానిని మక్కువతోచూచి, చేతులలో ఎత్తుకొని, ముద్దాడుచు దానితో చలగాటలాడెడివాడు. ఒకజ్ఞాని యిదిచూచి కుక్కపైని యింతటి యనురాగము చూపతగదని మందలించినాడు. ఏమిచేసినను కుక్కమూఢజంతువుగదా; ఎన్నడైనకఱవచ్చును. దానియజమాని యీబోధనాలకించి యొడిలోనున్నకుక్కను ఆవలికిత్రోసివేసి యికనెన్నడును దానిని చేరదీయుటగాని, ముద్దాడుటగాని, కూడదని నిశ్చయించుకొనెను. కాని, ఆకుక్క యజమానుడు బుద్ధిమార్చుకొనిడాని తెలియజాలక యెప్పటివలె యెత్తుకొని ముద్దాడునను పేరాశతో తఱచుగావాని చెంతకు పరుగెత్తుచుండెడిది. ఎన్నిసారులో యజమానుడు దానినికొట్టి తఱిమివేసినగాని కుక్కవానిని బాధించుటమానినదికాదు. నీగతియు, ఆయజమానుని గతిని బోలియున్నది. నీవు నీహృదయమునందు చిరకాలము ప్రేమచూపి పెంచిన కుక్కను నీవు వదలించుకొనకోరినను నిన్నుసులభముగ వదలకున్నది. అయినను భయములేదు. ఆకుక్కనిక చేరదీయకుము. అదినిన్నుచేరవచ్చునప్పుడెల్ల ఛీకొట్టి దూరముగతఱిమివేయుచుండుము. కొంతకాలమునకు ముద్దాడుమని నిన్ను తిప్పలు పెట్టుచున్న ఆకుక్క (కామము) నిన్నువిడిచివేయును."

422. నీకామసంకల్పమును పూర్తిగ వశముచేసికొనుము. అటులచేయుటయందు కృతకృత్యుడవైనచో నీస్థూలశరీరము