పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

144

నందొకమార్పేర్పడి "మేధ" అనునాడి యొకటి ప్రబలమగును. ఈనాడికి శరీరమందలి క్షుద్రశక్తులను ఉత్తమశక్తులగపరిణమింపజేయు స్వభావముకలదు. ఈ "మేధ" నాడిబలబడినయనంతరము ఆత్మజ్ఞానము యలవడగలదు.

423. పాములు విషజంతువులు. వాని పట్టుకొనబోయిన యెడల అవి నిన్ను కఱచును. మన్నుమంత్రించి వానిపైనిజల్లి వానిని వశముచేసికొను పాములవానికి పాములనుపట్టుకొనుట యంతకష్టమగు పనియేకాదు. ఏడెనిమిది పాములను సయితము అతడు చేతులకును మెడకును చుట్టుకొని యతడు ఆటలాడ గల్గును.

424. వంతెనక్రిందుగా నీరుపాఱుచు పోవునేగాని అక్కడ యదిమురుగదు. అటులనే ముక్తపురుషుని చేతులగుండా ధనము నడచిపోవునేగాని అందది నిలిచి పేరుకొనదు.

425. ఎవనికి ధనము దాస్యముచేయునో యతడే పురుషుడు. ధనమును వ్యయముచేయుట నెఱుగని వానిని పురుషుడనతగదు.

426. తమ ధనమును, తమ యధికారమును, తమ పేరు ప్రతిష్ఠలును, పలుకుబడిని చెప్పుకొని గర్వించువారు కలరు. కాని యివన్నియు నాలుగుదినాలముచ్చటలే! చచ్చినవెనుక వీనిలో వెంటవచ్చునదేదియు లేదు.

427. ధనములో గర్వించదగిన యంశమేమియులేదు. నీవు ధనవంతుడవని చెప్పుకొనజూతువేని నీకంటె ఎందరో యధికధనవంతులుకలరు. వారితోపోల్చునెడల నీవుదరిద్రు