పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

142

418. ఇంకొక మార్వాడీ శ్రీపరమహంసులవారిని దర్శించినప్పుడు "స్వామీ! నేను సర్వమును త్యాగముచేసి యున్నాను; ఇంకను నాకు భగవత్సాక్షాత్కారము లభించకుండుటకు హేతువేమి?" అని ప్రశ్నించెను.

శ్రీవారు "నూనెపోసి నిలువయుంచు తోలుతిత్తులను చూచియుందురు. ఆతిత్తుల నొకదానినుండి నూనెనంతటిని కార్చివేసిచూడుడు. దాని అడుగునను ప్రక్కలను కొంత నూనె అంటియేయుండి విడిచిపోదు. నూనెవాసనయో తుదివరకు నుండును. అటులనే కొంతసంసారవాసన మీయందు మిగిలియున్నది." అని వివరించిరి.

419. పాము కంటబడినప్పుడు "తల్లీ! మనసా! నీతోకను మాత్రము చూపుచు, తలను చూపకుండ తొలగిపొమ్ము" అను ఆచారము కలదు; అటులనే కామోద్రేకము పురికొలుపు విషయములనుండి దూరముగానుండుట తెలివిగలపని; వానిపొత్తువలన పతితులై తెలివి తెచ్చుకొనుటకన్న వాని పొత్తునకే పోకుండుట శ్రేష్టము.

420. మనస్సు భోగములపైని ఆశవీడి నిర్మలమైనప్పుడు అది మాధవునిపైని లగ్నముకాగలదు. ఈతీరున బద్ధజీవుడు ముక్తుడుకాగల్గును; హరినివీడి పెడత్రోవనుబోవు జీవుడు బద్ధుడే.

421. ఒకశిష్యుడు భగవధ్యానముచేయుచు కాలము గడుపుచున్నను, అప్పుడప్పుడుదుస్సంకల్పములు తమమనస్సులోలజూపుచునేయుండి, తానుకామమును జయింపలేకుండుటకు