పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

121

17వ అధ్యాయము.

మును సుస్థిరవిశ్వాసముతో స్మరించుము. నిత్యానిత్యవిచారము చేయుము.

355. ఎవనికి విశ్వాసము కలదో వానికి అన్నియు ఉన్నట్లే; ఎవనికి విశ్వాసములేదో వానికి అన్నియుకొఱతయే.

356. శ్రీరామచంద్రుడు లంకలో ప్రవేశించుటకుపూర్వము సముద్రముమీద వంతెనను కట్టవలసివచ్చెను. కాని విశ్వాససంపన్నుడగు హనుమంతుడు తనకు రామునిపై విశ్వాసమును సాధనముగా గొని ఒక గంతులో సముద్రమును దాటిపోగలిగెను. కేవలము విశ్వాసమహిమచేత స్వామికన్న సేవకుడు ఘనకార్యమునుచేయగల్గినాడు.

357. భరతదేశమునగల వైద్యులలో కేవలము విశ్వాసమును గొలిపిమాత్రమే రోగముల కుదుర్చువారు కలరు. "రోగమనునదియే లేదు." అని పూర్ణవిశ్వాసముతో మరల మరల స్మరించుడని విధింతురు. రోగగ్రస్తులు అటులస్మరణ చేసి, ఆభావనామహిమచేతనే ఆరోగ్యమును బడయుదురు. కాబట్టి నీవు పాపినని స్మరించితివా త్వరలోనె నీవు పాపివే అయిపోదువు. నీవు మహామహిమాఢ్యుడవని యెఱిగి విశ్వాసమును పూనుము. నీవెంతయో మహిమగలవాడవగుదువు.

358. ఒకశిల అనేకవత్సరములు నీటిలోపడియుండవచ్చును. అయినను ఒకచుక్కనీరైనను దానిలోప్రవేశించ జాలదు. కానిమృత్తిక నీటిస్పర్శతగులగానె మెత్త బడుచున్నది. అటులనే విశ్వాసముదృఢపడిన హృదయముగలవారు, బాధ