పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

122

లెన్నివచ్చినను దుఃఖములెన్నిపైబడినను కృంగిపోరు. దుర్బల విశ్వాసముగలవాడో యిసుమంతకష్టముప్రాప్తించిననే చంచలించిపోవును.

359. చకుముకిరాయి నీటియడుగున కోటిసంవత్సరములు పడియుండుగాక, అది తనయందలి అగ్నినికోల్పోవదు. నీవు దానిని యినుముతో యెప్పుడుకొట్టిననుసరే నిప్పురవ్వలు గ్రక్కును. సత్యమగు స్థిరవిశ్వాసి అటులుండును. ఈలోకములో అతడు ఎటువంటిపాతకజనుల నడుమనున్ననుగూడ తన భక్తివిశ్వాసముల నష్టపడడు. పరమేశ్వరనామముచె వినిపడినంతనే తన్మయతను పొందును.