పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

120

నను కోరికపుట్టినది. వెంటనే దానిని తెఱచి చూచినాడు. దానిలో "రామ" అని పరమేశ్వరునిపవిత్ర నామము ఒక్కటి మాత్రమే వ్రాయబడియుండుట వానికి తెలియవచ్చినది. "ఓసి! దీనిలోని రహస్యము యిదేనా?" అనితృణీకారముతో పలికినాడు. ఇట్లతడు అనుకొనువెనువెంటనే నదీజలములో మునిగిపోయినాడు. భగవన్నామము నందలి విశ్వాసము యద్భుతకార్యముల చేయగలదు. అట్టివిశ్వాసము ప్రాణమనవచ్చును. సంశయము మరణమే.

353. బ్రహ్మహత్య పాపమునకు పాల్పడిన ఒకరాజు ఎట్టిప్రాయశ్చిత్తముచేసికొని తాను పునీతుడుకా గల్గునో విచారించుటకై యొక ఋష్యాశ్రమమునకువెళ్లెను. అందుఋషిలేడు. వాని కుమారుడుమాత్ర ముండెను. ఆఋషిపుత్రుడు రాజు వచ్చిన విషయమును తెలిసికొని "ముమ్మారు రామనామస్మరణ చేయుము; నీపాపపరిహారమగును." అనిచెప్పినాడు. ఋషి తిరిగి వచ్చినప్పుడు తనకుమారుడు విధించిన ప్రాయశ్చిత్తకర్మనుగూర్చివిని, కోపించి, "ఆపరమేశ్వరుని పావననామమును ఒక్కసారి ఉచ్ఛరించినంతమాత్రాన కోటిజన్మలలో చేసిన పాపపుంజములన్నియు హరించునే! ఓరి మూఢుడా! నీవెంతటి విశ్వాస సూన్యుడవు! అట్టిపవిత్రనామమును మూడుసార్లు ఉచ్ఛరించుమని విధించితివా! నీవిశ్వాసహీనతకు శిక్షగా ఛండాలుడవై పుట్టుము." అని శపించినాడు. ఆతడే రామాయణమున పేర్కొనబడిన గుహుడు.

354. నీవు ఈశ్వరదర్శనము చేయగోరితివా వాని నామ