పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15వ అధ్యాయము.

సంసార విరక్తి.

329. లోకములో నివసించుడు, కాని లోకమునకు అంటుకొనకుడు. "కప్పను పాముముందు, గంతులు వేయించుడు. కాని పాము దానిని మ్రింగకుండ చూడుడు." అనుసామెత కలదు.

330. పడవనీళ్ళలో యుండవచ్చును; కాని నీళ్లుపడవలో వుండతగదు. సాధకుడు సంసారములో నుండవచ్చును; కాని సంసారము వానిలో యుండరాదు.

331. నీసంసారపుజోలి నీదికాదని సదా భావనచేయుము. అది భగవంతునిది. నీవు వానిసేవకుడవు; వాని ఉత్తర్వులను పాలించుటకే నీవు యిక్కడికి వచ్చియున్నావు. ఈభావము సుస్థిరమయ్యెనా, నరుడు తనదియని చెప్పుకొనుటకు యేమియు మిగిలియుండదు.

332. యజమానుని యింటినిగూర్చి "ఇదిమాయిల్లు"యని దాసీది పలుకుచుండును. కాని తనయిల్లు అదికాదనియు, తన యిల్లుదూరముగ ఎక్కడనో ఒక పల్లెటూరిలో యున్నదనియు దానికి సదా తెలిసియే యుండును; దాని యాశలు అన్నియు తన గ్రామముపైననే యుండును. తనచేతిలోనున్న యజమానుని బిడ్డనుగూర్చి "మాహరి! కొంటెవాడైపోవుచున్నాడు" అనియో లేక "మాహరికి,