పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

111

14వ అధ్యాయము.

328. వేయిచిల్లులుగల కడవతోనీళ్లుతెచ్చి, తననిష్కళంక వర్తనమును, ఋజువుచేసికొనవలసినప్పుడు, శ్రీమతిరాధాదేవి ఒక్కనీటిబొట్టైనను క్రిందబడకుండ తెచ్చినది. అందఱును చేతులుచఱచి ఆమెనుపొగడిరి. అట్టినిర్మలచరితయెన్నడునుండి యుండలేదనిరి. ఎన్నడును యుండబోదనిరి; అప్పుడు రాధ "నన్నేలస్తుతించెదరు? ఆమహిమయంతయు, శ్రీకృష్ణునిదే; వానినేస్తోత్రముచేయుడు. నేను కేవలము ఆయనసేవకురాలిని." అని బోధచేసెను.