పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113

15వ అధ్యాయము.

యిదియిష్టము, అదియిష్టము." అనియో పలుకుచుండును. కాని ఆహరి తన బిడ్డకాదని దానికి తెలిసియే యున్నది. ఈదాసివలె మమకారము లేనివారై మెలగుడని నాకడకు వచ్చినవారితో నెల్ల చెప్పుచుందును. లోకములో నిష్కాములైజీవింపుమందును. సంసారములో నుండవచ్చును, కాని సంసారమునందు అనురాగము పూనరాదు. సతతము తమ హృదయమును భగవంతునివైపు త్రిప్పుడనియు, తాము విడిచివచ్చిన స్వర్గధామమును సంస్మరింపుచు భక్తికొఱకై భగవంతునివేడుకొండనియు చెప్పుచుందును.

333. నీరుకాకినీళ్లలో బాగుగమునుగును; కానిదానిరెక్కలు నీటిచేత తడిసిపోవు. అటులనే ముక్తపురుషులు ప్రపంచములోవసింతురు; ప్రపంచమువారిని అంటదు.

334. సంసారమునందుండియు దానియందు రాగములేక ముక్తుడై యుండువాని లక్షణములెట్టివి? అతడు నీటిలోనితామరాకువలెను, లేక బురదలోని మట్టిగుడిశెయను చేప వలెను యుండును. ఆవరణలువీనిని అంటవు. నీరుతామరాకును తడుపజాలదు; బురద మట్టిగుడిశెయొక్క నిగనిగలాడు శరీరమును మలినపఱచజాలదు.

335. అన్నముతినిపాఱవేసిన ఆకువలె యిందువసింపుము. అదిగాడ్పులకరుణకు లోనైయుండును. ఒక్కొక్కప్పుడది గదిలోను మఱొకప్పుడు పెంటకుప్పలలోను యెగురునటుల చేయబడును. అట్లేయిప్పుడీస్థితిలోనుంచబడితివి; మంచిదియిట్లే