పుట:Shodashakumaara-charitramu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

153


తీపుమిగులఁ బువ్వుఁదేనియ గ్రోలి మ
త్తిల్లి కడల నున్నతేఁటిఁబోలె.

46


వ.

ఇవ్విధంబున నంగజాధీనుం డైన యమ్మానవేంద్రుండు.

47


సీ.

వనజాక్షికెంగేలుఁ దనకేలుఁ గీలించి
        కేళికిఁ దివియంగ లీలఁ గడఁగు
నంగనామణిమోహనాంగవల్లికఁ జూల
        నాలింగనముసేయ నప్పళించుఁ
జెలువతీపారెడుచిగురాకుఁగెమ్మోవి
        నాదట గముపంగ నాససేయు
నెలనాఁగమెలపారునిఱిచన్నుఁగవకాంతి
        ననురక్తిఁ గబళింప నగ్గలించు
నివ్విధమునఁ దమక మెంతయు మిగులంగ
నతివఁ జేరఁ గోరునవసరమునఁ
దోయజాక్షిరూపు మాయమై పోయినఁ
జాల ఱిచ్చవడు నృపాలసుతుఁడు.

48


వ.

ఆయింద్రజాలకలితమాయారూపం బని యెఱుంగనేరక మదనావేశంబుకతంబున హంసావళియ కా నిశ్చయించి యారమణి నన్ను గారవింపంగాఁ దలంచి యవ్వనంబునం దాఁగెనని యూహించి పూఁబొదల నోలఁబుల వెదకి వెదకి యున్మాదంబుం బొంది.

49


సీ.

అది నాకు నెలుఁ గిచ్చె నంగన యని యేగి
        కలకంఠ మదియైనఁ గళవళించు
నదె మాటలాడెఁ జంద్రానన యని చేరి
        శుకభాషణము లైన సొలపు నొందు