పుట:Shodashakumaara-charitramu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

షోడశకుమారచరిత్రము


ర్చినయింద్రజాలవిద్యను
వనజాననరూపు చూపవలయు ననుటయున్.

42


వ.

తనవిద్యాప్రభావంబున రాజకన్యమోహనాకారంబు దృగ్గోచరంబు గావించిన.

43


క.

వనజాస్యమోహనాకృతి
కనుఁగవ కతికౌతుకంబు గావించుటయున్
మనమున మాయారూపం
బని తెలియఁగ మఱచి చాల ననురక్తుం డై.

44


చ.

తళతళఁ బర్వుక్రొమ్మెఱుఁగుఁదండములం బురణించు మేనినుం
దళపమునందుఁ(?) జూపులు మనంబునుఁ జిక్కినఁ గ్రమ్మఱింపలే
కలికులవేణి ఱెప్ప యిడ కానరపాలుఁడు సూచుచుండె ని
శ్చలమతిఁ గాముతూపులకు జానుగ నిల్సిన దెప్పమో యనన్.

45


సీ.

నెత్తమ్మిరేకుల నెచ్చెలు లై యొప్పు
        మృదుపదంబులమీఁద మెలఁగిమెలఁగి
నునుమంచు మించునం గనకకుంభమ్ముల
        కెనయైన చనుఁగవ యెక్కియెక్కి
కందని యిందుని యందంబు నొందిన
        చిఱునవ్వు నెమ్మోముఁ జెందిచెంది
మెఱచినతొలుకారు మెఱుఁగులకవలైన
        చెలువుఁజూపుల మీఁదఁ బొలసిపొలసి
ముదితయనుపమానమోహనాకారంబు
చాల మరగి యూనృపాలుచూడ్కి