పుట:Shodashakumaara-charitramu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము

151


యీచిలుకలమాట లింతయిం పయి యున్నె
        వెలఁదితిన్ననిపల్కు వింటిమేని
యీ తేఁటిగమిచాయ యింతయొప్పయి యున్నె
        సుదతివేనలి చూచి చూతుమేని
పూవుఁబోఁడి హంసావళి యీవనమున
వేడ్క విహరింపకుండుట వీని కెల్ల
నింపు సమకూరెఁగాక యయ్యింతి యున్న
మనకు నింపుఁ జేయునొ యివి మానవేంద్ర.

39


వ.

అనినమాటలు విని యనురాగంబు నివ్వటిల్ల.

40


సీ.

పొలఁతి కౌఁగిటఁ జేర్పఁ బూచి నెత్తావుల
        క్రోవి యైనదియె యీక్రోవి యొక్కొ
మానినిగండూషమధువుసోఁకునఁ బూచి
        పొగడ నొప్పినది యీపొగడ యొక్కొ
నలినాక్షిపదతాడనంబునఁ బూచి శు
        శ్లోక మైనదియె యశోక మొక్కొ
యెలనాఁగమెఱుఁగుఁజూపులఁ బూచి భూజాత
        తిలక మైనదియె యీతిలక మొక్కొ
యివ్వనములోన నిన్నియు నెఱుఁగకున్నఁ
దరుణికౌగిటఁ జేర్చిన కురవకంబు
నాకుఁ జూపినఁ బరిరంభణంబు చేసి
నట్టు లైనఁ గృతార్థుఁడ నగుదు నబల.

41


క.

అని యంత మదనతాపము
ఘన మగుటయు సైఁపలేక కాంతా నీనే