పుట:Shodashakumaara-charitramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

షోడశకుమారచరిత్రము


క.

కమలాక్షికి బ్రాణము ప్రా
ణము తత్సఖి కీడు సేయునా తలఁపఁగ నీ
కమనీయమూర్తి విభవము
కమలానన బాము మాన్పఁగలిగెఁ గుమారా.

36


క.

నీవిడిసియున్నయది హం
సావళి విహరించు తోఁట యనవరతంబున్
భూవల్లభ యం దాడుదు
మావనితయు మేముఁ జాల ననుమోదమునన్.

37


సీ.

ఈ చంపకముపొంత నీమావి క్రీనీడ
        మానినీరత్నంబు మరుని నోఁచె
నీమాధవీలత నీయశోకముతోడ
        నబ్జలోచన వివాహంబు చేసె
నీకేళకుళిలోన నెలనాఁగ ప్రోదిరా
        యంచలకవల నిందించి యాడె
నీపువ్వుఁబొదలలో నీరత్నవేదిపైఁ
        వెలువ బొమ్మల పెండ్లి చేసె మున్ను
భూపనందన యీపొరపొన్నపొంత
ముత్తియంబులపందిరి ముదిత వెట్టెఁ
బ్రేమ నాడెడుచోట నీచామ చూపె
మానవేంద్రునిహృదయంబు మరులుకొనఁగ.

38


సీ.

ఈహంసయానంబు నింతయొప్పయి యున్నె
        యతివ యిక్కడ గెడయాడెనేని
యీపుష్పములతావి యింతలె స్సయి యున్నె
        సుందరిమైతావి సుడిసెనేని