పుట:Shodashakumaara-charitramu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశకుమారచరిత్రము

154


నదె తల చూపె నీలాలక యని డాసి
        తుమ్మెదపొద యైనఁ డూలపోవు
నదె చీరెఁ జేసన్న నబ్జాక్షి యని చేరి
        యెలమావి చిగురైన నిచ్చఁ గలగుఁ
దడవి కాననిచోటను దడవఁబోవు
నేల పొడసూపి మాయమై తివ్విధమున
నలఁపఁదగునె హంసావళి యనుచు దూఱు
భావజన్ముండు గారింప భూవిభుండు.

50


వ.

ఇవ్విధంబున మన్మథోన్మాదబాణవిదారితమానసుండగుచుఁ గొంతతడ వవ్వనాంతరంబున జరించినంత నత్యంతసంభ్రమంబున వసంతకుం డచ్చటికిం బఱతెంచి హంసావళీకన్య యున్నది యనుపలుకు మున్నుగా నన్నరనాథునితో నిట్లనియె.

51


సీ.

అధిప హంసావళి యాబూరుగున నుండ
        కొకపువ్వుఁ బొదలోన నుండి రాత్రి
యనలంబుచేత నేయాపదఁ బొందక
        బ్రదికియుండంగఁ బ్రభాతవేళఁ
బూవులకై పుష్పలావిక లేగి యా
        గోమలిఁ గాంచి తోకొనుచు బోయి
యంతఃపురంబున నడలెడుతల్లియు
        జనకుండు నున్నెడ కనుచుటయును
వార లెంతయు వెఱఁగంది వచ్చిగ్రుచ్చి
యత్తి కౌఁగిటఁ జేర్చి యందంద పేర్చి
క్రమ్ము కన్నీటితోడుత నుమ్మలించి
యమ్మ బ్రదికి యేగతి వచ్చితమ్మ యనుచు.

52