పుట:Shodashakumaara-charitramu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

143


కన్య నరయింతము రం డని చెలులం దోడుకొని యత్యంతసంభ్రమంబునం జని.

127


మ.

సరసానందన సత్కళాగమపరీక్షాకృష్ణకందార భా
స్వరనానారసభావనిర్మథనభోజక్ష్మాప విద్యానిరం
తరగోష్ఠీజగదేకమల్ల బహుశాస్త్రగ్రంథసిద్ధాంతవి
స్తరవిజ్ఞానకవిత్వతత్త్వకలనాసర్వజ్ఞసోమేశ్వరా.

128


క.

వీణావాదనచలదలి
వేణీవేణీప్రసూసవిహరన్మధుప
శ్రేణీగానాకర్ణన
ఘోణీకృతనేత్ర హరితగోత్రపవిత్రా.

129


లయగ్రాహి.

చంద్రరుచిరానన మహేంద్రబహుభోగ భుజ
        గేంద్రమృదుభాషణ దినేంద్రసమతేజా
సాంద్రశుభలక్షణ ధనేంద్రధనవైభవ మృ
        గేంద్రపటువిక్రమ గిరీంద్రనిభధైర్యా
మంద్రజయఘోషణ ఖగేంద్రబవవాహన శి
        బీంద్రఘనదాన మనుజేంద్రహితకృత్యా
రుంద్రమతిజృంభణ రతీంద్రలలితాంగక గ
        జేంద్రబలబంధుర కవీంద్రనుతకీర్తీ.

130


గద్యము.

ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబు నందు సప్తమాశ్వాసము.