పుట:Shodashakumaara-charitramu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

షోడశకుమారచరిత్రము


దలఁకుచు నశోకకళికయు
నెలుఁ గెత్తి విషాద మడర ని ట్లనిపలికెన్.

121


గీ.

పాడుగుడిలోని భూతము గూడముట్టి
వెన్నడింపఁగఁ దొడఁగె నో యన్నలార
కంటిరేయని మొఱవెట్టఁగాఁ దొడంగ
నయ్యెలుఁగు విని తలవరు లడ్డగించి.

122


వ.

వస్త్రాపవరణయు నాలంబకేశభారయు నాభీలకరవాలహస్తయు నా దానివెంటం బఱతేర వారలు గనుంగొని భూతం బనుచుం బొదివి పలుతునియలు గావించిన.

123


గీ.

అయ్యశోకకళిక యార్తనిర్ముక్త యై
యంతిపురము సొచ్చె నంతలోన
శంభుపూజకతన జ్వరముక్తుఁడై యున్న
మనుజవిభునిఁ జేరి వినత యగుచు.

124


వ.

కమలమంజరి చేసిన కపటకృత్యం బెఱింగించిన నరసి వెఱుఁగుపడి హంసావళివలని బలవంతం బైన వలవంత నొందుచు నాక్షణంబున మంత్రుల రావించిన నందఱుం జింతాక్రాంతులై యున్నసమయంబున భీమభటుండు జ్యోతిశ్శాస్త్రపారగుం డైన వసంతకు నాలోకించి ప్రశ్నం బడిగిన.

125


గీ.

అనలనిహతిఁ బడదు హంసావళీకన్య
సేమమున నరేంద్రుఁ జేరు ననిన
మదిఁ దలంకు మాలి మాళవాధిపున ఈ
వ్వార్త జెప్పెఁ దగినవారిఁ బనిచి.

126


వ.

భీమభటుండు దిగ్గన లేచి మననేర్చువిధంబుస మాళవేంద్ర