పుట:Shodashakumaara-charitramu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

షోడశకుమారచరిత్రము

అష్టమాశ్వాసము

క.

శ్రీభాసమాననానా
వైభవ జయలాభ.........ననితాంత
స్వాభా......తసౌరభం
శోభితపాండిత్య యన్నసూరామాత్యా.

1


వ.

.........మంబులు గడపి విరహతాపోపశమనార్థంబు మహీతలనాథుండు శీతలచ్ఛాయ నొక్కరుండును నాసీనుండై యుండి యశోకకలిక సచ్చటికిం బిలువం బంచి సమీపంబున నునిచికొని హంసావళి యే మయ్యె.....

2


క.

భూనాథ కమలమంజరి
తో నాఁ డటు నేను నరిగి తుదముట్టంగా
మానుగ నవ్విధ మంతయు
నే నెఱుఁగుదు విన్నవింతు నేర్పడ నీకున్.

3


వ.

సకలలోకాభిరామం బగునారామారత్నం బొక్కనాఁడు నర్తనాగారంబున కరిగి తదీయమణికుడ్యభాగంబునందు.

4


చ.

నరవరముఖ్య నీ దయిన నవ్యమనోహర మైనరూపు చి
త్తరువున వ్రాసి యున్నఁ గని తద్దయు వేడ్కలు నివ్వటిల్లఁగా