పుట:Shodashakumaara-charitramu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశకుమారచరిత్రము


బునఁ దోఁపఁగ నేటికి నిటు
నను వేఁడఁగ నీదుపను పొనర్చెదఁ జెలియా.

95


క.

కూరిమిచెలికిం దానొక
పోరామికిఁ గానిబోటి బోటియె నిను నీ
వారికిఁ దప్పించి తగ
న్నీరూపముఁ దాల్చి యాతని వరింతు ధృతిన్.

96


క.

అనుటయును మాయ దెలియక
యనుకూలతగాఁ దలంచి హంసావళి చ
య్యనఁ దనచీరలుఁ దొడవులుఁ
దననెలవును దాని కిచ్చి తద్దయు భీతిన్.

97


వ.

నన్ను నెక్కడ దాఁచె దనుటయు సంధ్యాసమయానంతరంబ యంధకారంబున నయ్యుత్పలగంధిం బురంబువెలికిం గొనిచని యొక్కపూఁదోఁటలోపల నత్యంతవిస్తారం బై తనరు బూరువుమ్రానికోటరంబున నునిచి వేగుజూమునప్పు డాకమలాకరు వంచించి నీపాలికిం జనుదెంచెద వెఱవకుండు మని యూఱడించె.

98


సీ.

.............యక్షణాలంకృతం బైన
        సముదీర్ణభద్రగజంబు నెక్కి
కుంజరాందోళికాఘోటకారూఢు లై
        ప్రాణమిత్రులు తమ్ము బలసి కొలువఁ
బాఠకనికురుంబపఠనరవంబులు
        గర్ణామృతంబు లై కరము మెఱయ
ముందట నెలకొన్నసందడిఁ దొలఁగించు
        నురువేత్రహస్తులయుఱిది చెలఁగఁ