పుట:Shodashakumaara-charitramu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

137


జారుతరదీపికాసహస్రములు వెలుఁగఁ
బెండ్లిశృంగారమునఁ జాలఁ బెంపు నొంది
యఖిలకమలాకరుఁడు కమలాకరుండు
రమణ మీఱంగ విదిశాపురంబు సొచ్చె.

99


వ.

అయ్యవసరంబున.

100


క.

మదగజఘోటకములతో
మృదుపాఠకరవము చెలఁగ మే నలరంగా
నెదురుకొనియఁ దనయల్లుని
విదిశాపురనాయకుండు విభవం బెసఁగన్.

101


వ.

ఇ ట్లెదురుకొని తోడ్కొని చని దైవయోగంబున హంసావళీభావంబు గలిగి కా దని యెఱుంగరాని కమలమంజరిని మహావైభవంబున వివాహంబు గావించుటయు నాడ విశేషశుభదినం బగుట నశోకకళికతోడ నయ్యిందువదనం దోడ్కొని కరదీపికాసహస్రంబులు ప్రజ్వరిల్లం గమలాకరుండు శిబిరంబున కరుగునప్పుడు కుంజరంబుమీఁద నన్నరేంద్రకుంజరు వెనుక నున్న కృతకహంసావళి తాను రాజనందన నునిచి వచ్చిన శాల్మలీపాదపంబుఁ గనుంగొని యత్తరుణి తా నతరువు దహించునుపాయం బూహించి యొడలికి వడంకు దెచ్చుకొని పతిం గౌఁగిలించిన.

102


క.

మలఁగి కనుంగొని ధరణీ
తలవిభుఁ డిది యేమి యనినఁ దాఁ బలుకక క
న్నులు మోడ్చి యుండెఁ బలుమఱుఁ
దెలుఁగ నొకకొంతవడికి దెలిసినభంగిన్.

103