పుట:Shodashakumaara-charitramu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

135


త్ఫుల్లాంభోరుహనేత్రకు న్మగఁడె యీదుర్భావుఁ డేమందునో
తల్లీ యాతనిఁ జూచి గుండె వగిలెన్ దయ్యంబొ యన్భీతిచేన్.

89


క.

తగుమగనికి నీనుచితము
దగుఁ దగఁ దనుమాత్రయైనఁ దగు నొసఁగంగా
మగక్రోఁతి యైనఁ దొడవగుఁ
దగునే తగుకన్య నొసఁగ ధరణీశునకున్.

90


క.

గారా మైనతనూభవ
నూరక యాచెడుగుముదుక కొసఁగెడు నని యీ
యూరెల్లను వెతఁ బొందెడు
నీరాజున కేల బుద్ధి యిటు లయ్యెనొకో.

91


గీ.

ఏమి చేయుదాన నెక్కడఁ జొత్తు నే
నితినిఁబొందు నిన్ను నెట్లు చూతు
ననుచు మాయజంత యశ్రులు నించిన
నమ్మి సొమ్మవోయె నళినవదన.

92


వ.

ఇట్లు మూర్ఛ మునిగి హంసావళి యజ్జరభి తన్నుఁ దెలుపఁ దెలిసి యిట్లనియె.

93


ఉ.

కామిని యట్టిరూపుఁ బొడగాంచినఁ బ్రాణము విడ్తు నప్డు నా
కా మగఁ డేల యట్టి వికృతాకృతి కిచ్చెడు తండ్రి యేల నీ
వేమెయినై.న రాత్రి నను నిచ్చటు వాపి మదీయవేషమున్
శ్రీమెయిఁ దాల్చి యాతని వరింపఁగదే యని యర్థి వేఁడినన్.

94


క.

తనతలఁచినట్ల యగుటకు
ననుమోదము బొంది ప్రమద మాననపద్మం