పుట:Shodashakumaara-charitramu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

షోడశకుమారచరిత్రము


వ.

చనుదెంచునప్పుడు దన యంతరంగంబున.

83


ఉ.

ఈసరసోక్తు లీమహిమ యీయవికారత యీవిలాస మీ
రాసిరి యీయుదారత ధరావరు లెవ్వరియందుఁ గల్గునే
యేసుకృతంబు చేసిన మృగేక్షణ కబ్బునొ భూతలంబుపై
నీసొబగుండు నాథుఁడుగ నింపులఁ దేలెడు నిత్యధన్యతల్.

84


వ.

అని యభినందించి యొక్క కపటోపాయంబుఁ జింతించి హంసావళీకన్యకు నతనిమీఁద నరుచి పుట్టునట్లుగాఁ బలికి మాయోపాయంబున నివ్విభుని నేన వరియించెద రాత్రి లగ్నం బగుట నా కవ్విధంబు సిద్ధించు నని నిశ్చయించి యబ్బాలికపాలికిం జని యేకతంబున నిట్లనియె.

85


క.

కమలాక్షీ భవన్మానస
కమలాకరమిత్రుఁ డైన కమలాకరభూ
రమణుండు గాఁడు దన్నా
మమువాఁ డితండు రాజమర్కట మరయన్.

86


గీ.

వికృతవేషి మఱియు వృద్ధు క్రూరాత్ముండు
పాపకర్ముఁ డధికచాపలుండు
కుఱుచ తెవులుగొంటు పఱికగడ్డమువాఁడు
గదలఁ డేమి చెప్పఁ గమలవదన.

87


క.

కడవతల గొగ్గిపండ్లును
మిడిగ్రుడ్డులుఁ బల్లపల్లమీసంబులు దే
గడచెవులు గూనిమూఁపులు
బడగ బడుగు జూనిఁ జెప్పఁ బనిలేదు చెలీ.

88


శా.

చెల్లంబో నిను వీని కీ దలఁచె లక్ష్మీహాని కోర్వంగ లే
కుల్లం బన్నరనాథచంద్రునకు రాయో కాక నీ యట్టియు