పుట:Shodashakumaara-charitramu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

133


రసంచలనచలితకుంతలుండును నై యొప్పారు నమ్మహీవల్లభు నల్లనఁ జేరం జని.

76


క.

అగణితవిలాసుఁ డగు నా
జగతీపతీమూర్తి మానసంబును జూపుం
దగులఁగ ననంతరాజ్యం
బగుఁగాక యటంచు భూతి యల్లన నొసఁగెన్.

77


గీ.

భూతి యిచ్చునపుడు భూపాలనందను
కరసరోరుహమునఁ గరము గదియ
నెఱకు లాడ నేసె మెఱుఁగుబాణంబులు
గ్రొత్తబత్తురాలిఁ గుసుమశరుఁడు.

78


క.

చెలువ యిటు పుష్పసాయక
దళితహృదయ యయ్యెఁ దనవిదగ్ధతకతనం
బులకలుఁ జెమరుం గంపము
వెలయఁగ నీదయ్యె నపుడు పెంపెసలారన్.

79


వ.

అవ్విభుం డాభూతిఁ బుచ్చుకొని సముచితాసీనం గావించి యెచ్చటినుండి వచ్చితని యడిగిన నది క్రమ్మఱ దీవించి.

80


క.

ఏను బహుదేశచారిణి
నీనిఖిలముఁ దెలియ నాకు నిష్టం బగుటన్
శ్రీనిధి నిను దర్శింపం
గా నరుదెంచితి ననినను గౌతుక మెసఁగన్.

81


క.

అనవుడు నాదరమున నా
జననాయకచంద్రుఁ దుచితసత్కారము లిం
పొనర నిడి వీడుకొల్పిన
మనసిజదందహ్యమానమానస యగుచున్.

82