పుట:Shodashakumaara-charitramu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

షోడశకుమారచరిత్రము


రినకమలాకరుఁడో య
జ్జనపతి వే ఱొకఁడొ యనుచు సంశయ మడరన్.

72


వ.

తన చెలి యగుకమలమంజరి కేకతంబున ని ట్లనియె.

73


క.

మనభూపతి కమలాకరుఁ
డనునృపతికి సన్ను నిత్తు ననినాఁడఁట యా
తనియున్నవేలమునకుం
జని తద్విధ మెల్లఁ దెలిసి చనుదె మ్మనినన్.

74


సీ.

తావులు వెదచల్లు పూవు లన్నియుఁ బుచ్చి
        కచముల జడముడిగా నొనర్చి
కట్టిన వెలిపట్టుపుట్టంబు సడలించి
        కరమొప్పు ప్రాఁతచెంగావి గట్టి
చందనమృగనాభిచర్చలు వోఁ జేసి
        మృదులనిర్మలభూతి మేన నలఁది
ధవళముక్తామయతాటంకములు వుచ్చి
        ప్రవిమలస్ఫటికము ల్చెవులఁ బూని
తొడవు లూడిచి రుద్రాక్షతొడువు వెట్టి
వరతపస్విని రమ్యభావంబుతోడ
నితరు లెవ్వరుఁ దా నని యెఱుంగకుండ
నంబుజానన యన్నగరంబు వెడలి.

75


వ.

వేత్రవతీతీరంబున నత్యంతవిస్తారోదారం బగు కమలాకరస్కంధావారంబు దరియం జొచ్చి పేరోలగంబున సింహాసనాసీనుండును సేవాగతానేకభూవల్లభకిరీటరత్నదీపికావిరాజితపదారవిందుండును జామరగ్రాహిణీకరచామీకరచామ