పుట:Shodashakumaara-charitramu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము

131


వ.

ఇష్టగోష్ఠీవినోదంబున నున్నయంత నమ్మహీకాంతునకు సంతసం బొదవఁ దేజోవిభాకరుం డగు ప్రభాకరుం డిట్లనియె.

66


క.

నీతనయను సర్వశుభా
న్వీతనయ నోసంగవలయు నీనృపతికి ను
ద్యోతితకౌతుక మొదవ మ
హీతలవర యనుఁడు నానరేశ్వరుఁ డంతన్.

67


వ.

సంతుష్టాంతరంగుం డై యెంతయుం దెలి వొంది వినయంబునం గరకమలంబులు ముకుళించి యంచితప్రియపూర్వకంబుగా నమ్మహీవల్లభున కి ట్లనియె.

68


క.

హంసావళిలో నెల్లను
హంసావళిఁ బోలు దిమ్మహాతేజమునన్
హంసావళికిని గవిజిత
హంసావళి కీవ తగినయధిపతి వధిపా.

69


క.

ఆకన్యారత్నంబును
నీకే తగు దిక్కులందు నిఖిలంబున సు
శ్లోకుండ వై వరింపు శు
భాకరలగ్నమున నవ్వరానన నెమ్మిన్.

70


వ.

అని పలుకుటయుం బుడమిఱేనికొలువున నున్న మౌహూర్తికు లెల్లింటినిశాసమయంబున విశేషలగ్నంబు గల దని విన్నవించుటయు నుల్లసిల్లి మేఘమాలధరణీవల్లభుండు నత్తెఱంగున కియ్యకొని సముచితప్రకారంబున వీడ్కొని యరిగి యమ్మహోత్సవంబున కుత్సహించిన.

71


క.

తనరాలెడు నవ్వార్తలు
విని హంసావళి కరంబు వేడుక నేఁ గో