పుట:Shodashakumaara-charitramu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

షోడశకుమారచరిత్రము


తం బంతయు దృఢముష్టికిం జెప్పిన నద్భుతప్రమోదరసాయత్తచిత్తుం డై నీకతంబున నానెచ్చెలివృత్తాంతం బంతయు నెఱింగితి నని యతని వినుతించి వివిధవస్తువాహనంబులతో నారక్కసుండు దోడ్కొనిపోవఁ బత్నీసమేతుఁ డై పుత్రవర్ధననామనగరంబునకు వచ్చి నన్నుం గాంచి యన్యోన్యస్నేహపూర్వకంబుగా నాలింగనశలప్రశ్నాదివిధానంబు లొనరించి దాని వరించి యభిమతక్రీడావినోదంబులసుఖం బనుభవించుచుఁ గొన్ని నా ళ్ళుండునంత.

62


క.

పుత్రకులు లేమి నపుడా
ధాత్రీపతి రాజ్యభరముఁ దమయం దిడి స
న్మైత్రి దగ నునిచి పరమప
విత్రత వని కరిగి నియమవిధి వరిల్లెన్.

63


వ.

మేమును భవద్దర్శనఁబు గోరుచు నిందుండ మాభాగ్యవశంబున దేవరం బొడగని కృతార్థుల మైతి మని విన్నవించుటయు నమ్మహీవల్లభుండు సంతసిల్లి వారల నుచితప్రకారంబున సంభావించి హంసావళియందలి యనురాగంబునకు ననుగుణోద్యోగంబుగా దిగ్విజయయాత్ర నెపంబున విదిశాపురంబున కరిగి తత్పురోద్యానంబున వేత్రవతీతీరంబున విడిసి మేఘమాలమహీపాలునకుం దమరాక యెఱింగించి పుత్తెంచిన.

64


గీ.

అతఁడు సకలవస్తువితతులు కాన్కగాఁ
గొనుచు నేగుదెంచి వినతుఁ డగుచు
నానృపాలు గాంచి యత్యంతబహుమాన
లీలఁ జెంది మైత్రి గీలుకొనఁగ.

65