పుట:ShivaTandavam.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేళకర్తల నెత్తి యాలాపనము దీర్చి
యాలాపనమ్ములో నక్షులను నఱమోడ్చి
సంవాదివాదు లనుస్వరములను జూపించి
క్రొవ్విరుల గుచ్ఛములు గునిసిపోయిన యట్లు
గమకములు వెలయించి కడఁగి జారులుబట్టి
ప్రమదమ్ముతోడఁ మూర్ఛనలెల్ల రాఁబట్టి
మంద్రమధ్యమతార మధురిమలు జూపించి
సాంద్రమ్ముగా గానసాగరమ్మును రేపి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
వక్రరాగము నెత్తి, పాండిత్యధీరతో
పక్రమణమును బూని, ప్రక్కవాద్యముఁ జూచి
కనకాంగియే[1] యంచుఁ గనుఁగోనలనె నవ్వి
వినిపించి, శుద్ధస్వరనిచయంబునె ద్రవ్వి
కాలువిడు[2] పఱయు ముక్కాలుచోటుల నెత్తి
కోలుఁ జూపించి, నిక్కుగఁ బల్లవులఁ బాడి
కాలభేదములతోఁ గలితనం బెలయించి
సోలు నిర్జరమనస్సుల నెల్ల వంచించి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

  1. కనకాంగిరాగమున కన్నియు శుద్ధస్వరములే గలవు.
  2. పాటలోని యెత్తుగడ భేదములు.