పుట:ShivaTandavam.djvu/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రీతిఁగావింప నిల్చిన దేవతల కెల్ల
నాభికెదురుగ దక్షిణంబైన హస్తమ్ము
శోభిలనుజల్లింప సోలపద్మపుముద్ర [1]
ఒకవైపు గటిభాగ మొయ్యారముగ నొత్తి
సకలలోకముల కాశ్చర్యంపు సిడమెత్తి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
తకిటతక, తకతకిట, తకతకిట, తకిటతక
తకతదిగిణతొగిణతొ, కిటతకతదిగిణతొ
కిటతకతదిగిణతొ, కిటతకతదిగిణతొ
చటులంబులగు జతులు[2] సరిగాఁగఁ దూగించి
ససరిరిస [3] రిగరిరిస సరిగాగ రీగాగ

గనగాగ ధపసాస

రి రి స రి స స రి గా గ రీ గా గ రి గ రి రి స
స రి సా స పదపాప సరిగ నెత్తులుముడిచి
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు

  1. అన్ని వ్రేళ్లును సందులు గలవిగా ద్రిప్పి పట్టిన సోలపద్మము.
  2. మృదంగ వరుసల ప్రస్తారము.
  3. మోహనరాగ స్వరములు.