పుట:Shathaka-Kavula-Charitramu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండితారాధ్యులు.

7


"గోదావరిమండలమునందలి భీమేశ్వరమున భీమేశ్వరలింగమున కర్చకుఁడగు భీమనపండితునికిఁ గొడుకని తెలియుచున్నది. గౌరాంబ యీతనితల్లి. [1] వీరిది ఋగ్వేదము, గౌతమగోత్రము, శ్రీశైలమల్లికార్జునదేవు నుపాసించినతరువాతఁ బుట్టినందున నీతనికి మల్లికార్జునుఁ డన్న పేరు పెట్టిరి.” (చూడు పీఠిక 21 ఫుట.)

ఈతనిగురువు కోటిపల్లి యారాధ్యదేవుఁడు, ఈయారాధ్యదేవర గురువు “అనాంతరయ్య."

పండితారాధ్యులు బాల్యమునుండియు విద్యావివేకసంపన్నుఁడై తనగురువుకడ సమస్తవిద్యలను, శైవమతరహస్యములను గ్రహించి, తనయనుభవముల గ్రంథముల వ్రాసి, జంగముల నారాధించుచు, భక్తులచరిత్రములను, మహిమలను వినుచు, తానుబోధించినట్లు నడుచుకొనుచు శివపూజాధురంధరుఁడై జీవితము గడపెనని చరిత్రమునందు సోమనాథుఁడు వివరముగ వర్ణించియుండెను. ఇదిగాక బసవనయంత వాఁ డీతని జందెము తీసి జూతివిడిచి తనమతము నందుఁ గలియుమని వార్త నంపఁగాఁ బండితుఁడు "భక్తిమీఁదవలపు బాహ్మ్యంబుతోఁబొత్తు బాయలేను నేను బసలింగ" యని ప్రత్యుత్తర మంపెనని శైవులలో వాడుకగలదు. ఈకథవలనఁ బండితుఁడెంతగొప్పవాఁడో- సత్యము నంగీకరించిన యీతని " బాహ్మ్యంపుఁ బొత్తు” వీడలేనిమతాభిమాన మెంతయోకూడ - వెల్లడియగుచున్నది. ఈతఁ డనేకసంస్థానములకుఁ బోయి యనేక బౌద్ధపండితుల నోడించి నట్లును, తీవ్రమగుమతప్రచార మొనర్చినట్లును దెలియుచున్నది. బౌద్ధపదపదాచార్యుఁ డీతనికి సమకాలికుఁడు. పండితుఁడు బసవసందర్శనార్థము బయలుదేరి కర్ణాటకమునకుఁ బోవుచుండగా దారిలో బసవఁడు మరణించెనని విని శ్రీశైలముసకుఁ దిరిగిపోయెను. ఆప్రాంతములందున్న వెల్లటూరునందే వృద్ధత్వమున బసవనతరువాతఁగొలది

  1. చతుర్మఠనిర్ణయ మను సంస్కృతగ్రంధము.