పుట:Shathaka-Kavula-Charitramu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

శతకకవులచరిత్రము


యించినట్లుకర్ణాటకకవిచరిత్రమునందు వ్రాయఁబడియున్న ది. కావునఁ బైగ్రంథము లేభాషలో రచియించెనో తెలిసికొనలేము. ఇంక ననేకకృతు లీతఁడు రచియించెనని యనుమానించుట కనువగుమాటలు దీక్షా ప్రకరణము ఫుట 62 లో నున్నవి. పండితునిశివతత్త్వసారాదికృతులు వెనుకఁబడుటకు నశించుటకునుగూడఁ గారణములు తరువాతకవు లీతని సాంగముగ ననుకరించుటయే యని శ్రీలక్ష్మణరావుగారు చూపినకారణములు సత్యేతరములు కావు. (చూడు. పుట 13, 14, 16, 16 శివతత్త్వసారపీఠిక -)

పండితారాధ్యులు బసవన్నకు సమకాలికుఁడగుట నీతనికాలము నిర్ణయించుట కష్టకార్యముకాదు. బసవఁడు 1167 కీ|| శ || మృతి నొందెను. కావున పండితారాధ్యులు 12వ శతాబ్దమునడుమవాఁ డనవచ్చును. ఈశతాబ్దమే మన శతకవాఙ్మయారంభముగ నింతవఱకు దొరకిన గ్రంథములవలనఁ దెలియుచున్నది. పండితారాధ్యునితో సమకాలికులైన రాజులు (1) వెలనాటి చోడుఁడు 1163-1180 (2) ఉదయావనీశుఁడు 1162 (3) బుద్ధరాజు 1171, నను ముగ్గురురాజులకాలమువలనను పండితారాధ్యచరిత్రము నాతనికిఁబిమ్మట 60, 70, సంవత్సరములలో నున్న పాలుకురికి సోమనాథుడు వ్రాయుటవలనను, కన్నడకవి సోమరాజు కాలములవలననుగూడ 12 వ శతాబ్దమే యని శ్రీలక్ష్మణరావు గారు సకారణముగ నిర్ణయించియున్నారు. (చూడు పీఠిక పుట 16, 20) పండితారాధ్యచరిత్రమునందలి సంగతులవలనను, శివతత్త్వసారము నందలి కొందఱుభక్తుల ప్రసంగములను జూపి యీశతకము బసవన్న మరణానంతరము పండితుఁడు వ్రాసియుండవలె నని శ్రీలక్ష్మణరావు గారూహించిరి. (పీఠిక వుట 20)

పండితారాధ్యచరిత్రము పండితుని కరువది డెబ్బదిసంవత్సరములలోఁ బుట్టినదని శ్రీలక్మణరావుగా రనిరి. ఇంకను జేరువయని నే నూహించుచున్నాను. చరిత్రమునందలి సంగతులవలనఁ బండితుఁడు