పుట:Shathaka-Kavula-Charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxxv)


గారశతకములు మిక్కిలి తక్కువ. కావున భక్తిశృంగారముల రెంటిని నేనొక్కటిగాఁ బరిగణించటకే యంగీకరించెదను. భక్తిశృంగారములను, జ్ఞానవైరాగ్యములును గలుపుకొని భక్తి జ్ఞానశతకములని రెండువిధములుగా శతకముల విభజించుకొనవచ్చును. ఇవి పోఁగా మిగిలిన వానిలో నీతిశతకములు, హాస్యశతకములును మిగిలియుండును. ఇన్ని విభాగము లొనర్చుకొనినను వివిధవిషయము లుండుసంకలితములు కూడఁగలవు. భక్తిలోనుశృంగారములోను, శాఖలు విభజించుకొనవీళ్ళున్నవి. ఆభేదము లన్నియు " వేఱొకచో వివరించెదను.

మనశతకములు సాధారణముగా స్వతంత్రరచనములే కాని కొన్ని కేవలభాషాంతరీకరణములు సూర్యశతకము, భర్తృహరివంటివి; కొన్నియనుసరణములు సుమతి, కాళహస్తీశ్వరశతకముల వంటివి; కొన్ని సంకలితాభిప్రాయసూచకములు భాస్కర, దాశరధీశతకముల వంటివి; స్వతంత్రరచనము లున్నవి వేమన, కవిచౌడప్ప, వేణుగోపాలశతకములవంటివియఁ గలవు. రాజనీతి, సేవకనీతి,లో కనీతి, బాలబాలికనీతినిఁబ్రకటించినవి కొన్ని యున్నవి. ఇవికూడఁగొంతవఱకుసంస్కృతానుసరణము లనవచ్చును. నీతిశతకములు ధర్మశాస్త్రముల వంటివి, ప్రభుసమ్మితము లగువేదములవంటివి. కావున వీనికిఁ గావ్యత్వము సిద్ధింపదు.

భక్తిశతకములయందు వారివారియాత్మసంక్షోభమును భక్తులు వెల్లడించుకొనిరి. శృంగారశతకముల యందుఁ గాంతాలలామ, లావణ్య చంద్రవదనశతకములు కేవలకాముకజనార్హములుగఁగన్పట్టును. తాడిమళ్ళరాజగోపాల, మల్లికార్జున, కలువాయి శతకములు భగవంతుని గుఱించి చెప్పిన శృంగారశతకములు. ఇవిగాక నీతిశాస్త్రములు, జ్యోతిషము, శబ్దశాస్త్రసంబంధ మగునిఘంటువులునుగూడ శతకరూపమున నున్నవి. బద్దినీతులు, నీతిమంజరి, శిఖనరసింహశతకము, సాంబ నిమంటువు మొదలగున వీతరగతిలోఁ జేరును, ఇవికూడఁ గావ్యములు కావు. ప్రాయికముగా భక్తిశతకములే యెక్కువ. రెండవస్థానము