పుట:Shathaka-Kavula-Charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxiii)

కృష్ణరాయనికి నప్పకవికి నడుమ గొన్నిశతకములు కనఁబడుచున్నవి. వజ్రపంజరశతకము, మరున్నందనశతకము, గువ్వల చెన్నశతకము, బాలగోపాలశతకము, చంద్రదూత 'మొదలగున వీకాలములోనివి.

వేణుగోపాల, చంద్రశేఖర, కుక్కు.టేశ్వర, రామలింగఁ కవి చౌడప్పశతకములు 16, 17 వ శతాబ్దప్రాంతములఁ బుట్టిన వని తోఁచుచన్నది. ఇవి యన్నియుఁ దిట్టు, హాస్యశతకము లని చెప్పవచ్చును. వేణుగోపాలశతకము లావణ్యశతకకర్త యొనర్చె నని కొంద ఱందురుకాని సత్యము తెలియదు. కూచిమంచి తిమ్మున్న, కవిచౌడప్ప, అడిదముసూరకవులచరిత్రములు మనకుఁ దెలియును.

17 వ శతాబ్దమునందు శతక వాఙ్మయము మిక్కిలియభివృద్ధఁ గాంచినట్లు పెక్కునిదర్శనములు కనఁబడుచున్నవి. వేనవేలుశతకములు పుట్టిన వనఁదగిన ట్లున్నయీక్రిందినిదర్శనములఁ జూడుఁడు. పెద్దాపురసంస్థానాధిపతు లగుబలభద్రజగపతిరాజుగారు రామశతకమును, రాయజగపతిరాజుగారు భద్రాద్రిరామశతకమును వ్రాసిరి.

(1) చింతలపల్లి వీరరాఘవకవి తాను వ్రాసినమధుర వాణీవిలాసమునందుఁ దాను

"జాములో శతకంబు సంధించి కంకణా
 దులు గొంటి వలరాయదుర్గమునను”

అని తన్నుఁగూర్చి చెప్పుకొనినాఁడు. కవితాత మట్ల యనంతుఁడు. పూలరంగపతిరాజులకాలము వాఁడఁట! అనఁగా కవిచౌడప్పకు సమకాలికుఁడు. వీరరాఘవకవి పెదతండ్రి యగుగోపాలకవి యార్యా శతకమును వ్రాసినట్లు చెప్పుచున్నాఁ డు.

"విలసత్పాండితిఁ గల్పనాగతి జగద్విఖ్యాతుఁడై జాములో
 పల నార్యాశతకంబు వజ్రగిరిగోపాలాంకితం బూహచే