పుట:Shathaka-Kavula-Charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xxii)


బడుచున్నవి. కాని దానినడక, భావములప్రవాహము, .భక్త్యుద్రేకము నీశతక మాశువుగఁ జెప్పినట్లు కనఁబఱచుచున్నవి. ఇది కవి ప్రౌఢవయస్సున వ్రాసినట్లు గ్రంథస్థవిషయములవలనఁ దెలియు చున్నది. శతక మీతనిచేతిలో సంపూర్ణస్థితికి వచ్చిన దని చెప్పవచ్చును.

సర్వేశ్వర దాశరథీశతకముల విషయమయి యతిమానుషములగుకథలు చెప్పుచున్నారు. అవి సత్యమైనదియుఁ గానిదియుఁ జెప్పుటకు వీలులేదుకాని, దేవకీనందనశతకవిషయమై యొకపద్యము గ్రంథస్థమై రెండుప్రతులలోఁ గానవచ్చుచున్నది. కొందఱుశతకకర్తలు భక్తితోఁ బద్యములు వ్రాసి గోదావరిలో వేసిరనియు, నీటి కెదు రీఁదినవిమాత్రమే తీసికొని శతకముగఁ గూర్చిరనియుఁ జెప్పుదురు. భక్తిభరితము లగుషద్యము లన్నియుఁ జక్కని వనుట కీకథ చెప్పుదు రని తోఁచుచున్నది, ఎట్లయిన నున్నకథ కేవల మసత్యమనుటకుఁ దగినకారణములు లేనప్పుడు, అట్లు సిద్ధాంతములు చేయుటకు మన కధికారము లేదుకదా! దేవకీనందనశతకము పరిషత్ప్రతి నె 2347 రులోఁ గొన్ని పద్యము లధికమున్నవి. కొన్ని నారాయణశతకపద్యములతోఁ దుల్యములు. అందలి 110 పద్యములకుఁ బిమ్మట నున్నతుదిపద్య మిది:

"సదయస్ఫూర్తిగళల్ ఘటించి కవిరక్షశ్రేష్ఠుఁ డామోదియై
 పదివేల్‌పద్యము లందు నూటపది సత్పద్యంబు అర్పించె మీ
 పదనీరేజములందు దివ్యతటినీపాథః ప్రపూర్వాభిము
 ఖ్యదయ౯ (ధుని౯?) గాంచినదౌట మీకరుణ కృష్ణా! దేవకీనందనా 1"

ఇఁక గృష్ణరాయనికాలమునఁగూడ జాటువులు పెక్కులు కనఁబడవు. ముక్కు తిమ్మన్నత్రిస్థలీదండకము, తెనాలి రామలింగని దశావతారపద్యముల పిడుగుఱాళ్ళు, రామరాజభూషణుని వని చెప్పు రామతారావళియు ననేకములు చాటుపద్యములు నున్నవి. శతకములు మఱి కనఁబడుటలేదు,