పుట:Shathaka-Kavula-Charitramu.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఊగుమూడి సూపరరాజు. 300

కలితముగా నొక్కశతకంబు రచింపడదే మొ తత్కృతుల్
తెలియఁగ నీ వె యదనియొ ఛీమతి సత్య వతీ సరస్వతీ ,

ఉ. మువ్వురుతల్లు తెల్లజగముల్ పరిపాలన చేయనైన మీ
మువ్వురిలోన నిర్వరకుఁ బుట్టువును = ఏలిదండ్రులు యిలా
రవ్వరొ నీకుఁ దల్లియెపలో యెఱుంగను గీస్కోమాని లే
నవ్వునఁ దెల్పు మీ సరవి నాయమ సత్య వతీ సరస్వతీ ||

చ. కవితయు నా నెఱుంగరు జగంబున మున్నట వామలూరు సం
భవుఁడు భవత్ప్రసాదమున పద్య నిబంధము రామమూర్తిపై,
శిషకర దేవభాషను సృజించిన వ్యాసుఁగు కాళిదాసుఁడు
న్న వలఁ బ్రసిద్ధులైని జగదంబిక సత్యవతీ సరస్వతీ !

చ. అవనిఁ దెనుంగు కావ్యముల కారగురుం డగునన్న పొర్యుఁడు:
గవికుల సార్వభౌముఁ డనఁగాఁచగు తిక్కనసోమయాజాయణ
భువననుత ప్రకాశుఁడగు పోతనమంతీయు నీదయ మహా
కవు అని లోకు లెన్న సడిఁ గాంచిన సత్యవతీ సరస్వతీ!!


ఊడుమూడి సూరపరాజు


ఇతఁడు శ్రీ వేంకటేశ్వరశతకమును రచియించెను. "ద్వారకా తిరుపతివేంకటాచలపతీ ననుఁబోవుము వేగ శ్రీపతీ!" అని మకుటము. ఇతనిది గోదావరిమండలములోని జొన్నాడ యనుజన్నవాడ కాపురము. ఈ జన్నవాడకడ బ్రహ్మయజ్ఞము చేయుటచే దీనికి యజ్ఞవాటిక యని పేరు కలిగినదఁట. అది యచ్చతెలుఁగున జన్నవాడ యైనదంట! ఈ యుత్పత్తి యిటీవలివా రూహించియైన నుందురు. లేదా బ్రహ్మకాకపోయినను బాహ్మణులైన నచ్చట యజ్ఞము చేసియుంట నీపేరు వచ్చియుండవచ్చును. ఇతఁడు జనార్దనస్వామిభక్తుడు. జొన్నాడ జనార్దనస్వామి పేరఁగూడ నీతఁ డొకశతకము రచియించియుండును. ఇతనిది వందివంశము, అనఁగా భట్రాజు. ఇంటిపే రూడుమూడివారు. సూరయ సరసమ లనుదంపతులకుఁ గుమారుఁడు బ్రహ్మరాజు. అతని