పుట:Shathaka-Kavula-Charitramu.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 శతకకవుల చరితము.

భార్య భద్రమ. ఈయిరువురకుఁ బుత్రుడు ప్రస్తుతశతకకర్త యగు సూరపరాజు. ఇతని గురువు "అనంతకవి.”

చ. ఇరువుగ నీదు. కుక్ష్మి నిను నేడుజగంబులుదాల్చి గిట 'పై
బంగిన నీవు దేవకికి బాలుడు యుదరంబులోపలం
బెరుగు టబెట్లు నేక్చెతి ఇభేద్య చరిత్ర మహాత్మ ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ ననుఁ బ్రోవుము వేగ శ్రీపతీ.

చ. వరయతి క్షణజ్ఞులగు వందిత సత్కవు లెల్ల మెచ్చఁగా
గరిమను ఒక ప్రొ సళతకంబొనఁగూర్చి సుపుష్పమాలంగా
సరిహః మికొనర్చెడను నారద గానవిలోల ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ ననుఁబ్రోవుము వేగ శ్రీపతీ.

ఈతఁడు చెప్పినట్లు "ర"కారప్రాసముతోఁ బద్యములన్నియు గట్టిప్రయత్నముచేసి వ్రాసినాఁడు. అందువలననే భావము లిచ్చమెయి సంపూర్ణత నొంది నూతనము లైనవి కాకపోయినవి.

ఈతఁ డాదికవిస్తుతియందు తిక్కన్న, భట్టుమూర్తి, బమ్మెర పోతన్న లనుమాత్రము స్తుతించి యున్నాడు. తనకులమువాఁ డగుట భట్టుమూర్తినిఁగూడ స్తుతించెను. భట్టుమూర్తియనఁగా రామరాజు భూషణుఁడా? మూర్తియా? అనుతగ విక్కడఁ దేలదు. మొత్తముమీఁద గవి 16వ శతాబ్దమునకుఁ బిమ్మటవాఁ డనుటస్పష్టము. జొన్నాడ ప్రాంతములవిచారణ మొనర్చినచో నీతనివంశము వారివలన నేమైనవివరములు తెలియవచ్చును. శైలికిఁ గొన్నిపద్యములఁ జూపెదను.

చ. హరుసకు మ్రొక్కి పొర్వతికి సంజులిఁ జేసి వినాయకాఖ్య దే
వరకు నమస్కరించి మది వాణికి దండ మొనర్చి చంద్ర భా
స్కరులకుఁ గేలు మోడ్చియును గబ్బము మీకోసఁగూరు ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ ననుఁ బ్రోవుము వేగ శ్రీపతీ! .

చ. వరికంతా పటిష్ఠుడగు వ్యాసునక్కు మతీ తిక్క యజ్వకు మూ
నిరతము భట్టుమూతిక కిని నిత్యము బమ్మెర పోతరాజుకు
సరవిని మొక్కి మీకుఁ గృతిచూపక మాలగూరు ద్వారకా
తిరుపతి వేంకటాచలపతీ నముంబ్రోవుము నేగ శ్రీపతీ.