పుట:Shathaka-Kavula-Charitramu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xvi)


గిరి తిమ్మన్న , (3) ఎలకూచి బాలసరస్వతి, (4) గురురాజకవి, (5) పోచిరాజు వీరన్న యీయైదుగురును సంపూర్ణముగఁదెలిఁగించిరి. సూర్యశతకమున కాధునికులేగాక పూర్వకవి యొకఁడు తెలిఁగించినట్లు ప్రబంధరత్నావళివలనఁ దెలియుచున్నది. ఇందు సంస్కృత పంచకావ్యములఁ దెలిగించి యనేకకృతు లొనర్చిన పోచిరాజు వీరన్నయిట్లు తనభళ్ళాణచరిత్రాదిని నుడువుచున్నాఁడు.

"సంస్కృతంబైన శంకరాచార్య విరచి, తంబు లానందలహరి సౌందర్యలహరి
 భర్తృహరికృతమైన సుభాషితమును, శతకములుగాఁగ మత్ప్రకల్పితములయ్యె.”

భక్తిపుంజ మగుముకుందమాలకూడఁ (గులశేఖరాళ్వారు కావ్యమునుఁ) దెలిఁగించియున్నారు.

(1) ఇట్లే పలువురు తెలుఁగుకవులు సంస్కృతముసఁగూడ శతకములు వాయుచువచ్చిరి. "

"నిర్మించినాఁడవు నిర్జరభాషచే శతకంబు, భాస్కరస్వామికెలమి ”

(రామవిలాసమున ఏనుఁగులక్ష్మణకవి.)

(2) చిత్రాడ వేంకటేశ్వరశతకము.

(3) కుమారశతకము ననునవి తెలుగువారు వ్రాసిన సంస్కృత శతకములు. ఇంకను బెక్కులుండవచ్చును.

అమరుశతకమును , తాళ్ళపాక వేంకటేశ్వరదీక్షతపుత్రుఁడగు తిరువేంగళ్ళప్ప శృంగారామరుశతక మని తెలిఁగించెను. శిష్టు సర్వశాస్త్రికవికూడ దీనినే తెలిఁగించి కాళహస్తి సంస్థానాధిపతులకుఁ గృతి యిచ్చెను. మండపాక పార్వతీశ్వరశాస్త్రికూడఁ దెలిఁగించెను.

ఇంకను శృంగారతిలకాదులుకూడఁ దెలుఁగులోనికి వచ్చినవి. ఈభాషాంతరీకరణములకుఁ బూర్వమునుండియు మన తెలుఁగుశతకము లున్నట్లు కనఁబడుచున్నది. ఆశతకములజన్మము, నభివృద్ధియుఁ బరీక్షించుకొందముగాక!