పుట:Shathaka-Kavula-Charitramu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xv)


గలిసి బెదరి యదృశ్య మగుచున్నను, వాఙ్మయచరిత్రకారున కీమన యక్షగాననిర్మాణము, ఖేలనము, నాట్యకళ, మున్నగువానిపూర్వ చరిత్రము, వానిరహస్యములు నూహించుట కత్యంతోపయోగముగ నున్నవి.

సంస్కృతతవాఙ్మయము నందలిశతకములు మనతెలుఁగుశతకములుగాఁ గొన్నిభాషాంతరీకరింపఁ బడినను, మనశతకవాఙ్మయము స్వతంత్రమైనదిగానే కనఁబడుచున్నది. వేణుగోపాల చంద్రశేఖర శతకములు పూర్ణముగ స్వతంత్రరచనములు. ధూర్జటికాళహస్తిశతకమునందుఁ గొన్ని శివానందలహరిపోలికలు, సుమతిశతకమునందు సంస్కృతనీతిపద్యచ్చాయలు, కనఁబడినను మనశతకములు మూఁడుపాళ్ళు స్వతంత్రరచనము లనవచ్చును. కొందఱుశతకకర్తలు సంస్కృతశ్లోకములభావము లనుకరించినట్లుకూడఁ గనఁబడుచుండును.

ప్రాస్తావికపద్యావళినుండియేమి నీతిమంజరి, హితోపదేశ, పంచతంత్ర, భారతము మొదలయిన వానియందలి శ్లోకాభిప్రాయముల నేమి, కొందఱు శతకకవులు సాంగముగఁ దీసికొని భాషాంతరీకరించిరి. తాంబూలనిర్ణయము, భార్యాధర్మములు, మొదలగునవి భాషాంతరీకరించిరి. మనవారు పూర్వుల ననుసరించుట గౌరవ మని యభిప్రాయము కలవారు. మంచివస్తువు కనఁబడినప్పు డది తెలిగించుచు వచ్చిరి. ఇట్లయ్యు మన శతక వాఙ్మయ ముపజ్ఞానహిత మనియే చెప్ప వీళ్ళు కలవు.

భాషాంతరీకరణములు.

నడుమ సందర్భానుసారముగఁ జూపినవికాక సంస్కృతము నందలి నృసింహ, రామ, కృష్ణ కర్ణామృతములు, ముకుందమాల, మహిషశతకము, సూర్యశతకము మున్నగుశతకములను మూలానుసారము భాషాంతరీకరించుకొని యున్నాము. భర్తృహరి శతకములను నలుగు రైదుగురు తేలిఁగించియున్నారు. (1) ఏనుఁగు లక్ష్మణకవి, (2) పుష్ప --