పుట:Shathaka-Kavula-Charitramu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xiv)


గూడ నున్నవి. రాజును స్తుతింపవలెఁగాని యది స్తోత్రముగాఁ గనఁబడరాదు. తనశక్తి వెల్లడికావలెఁగాని యాత్మస్తుతి చేసికొనరాదు. భక్తిచే నుప్పొంగినశరీరము గలశ్రీనాథునిపారవశ్యము దైవానుగ్రహమున నతని కారెండుకార్యముల సమకూర్చినది.

(3) అడిదము రామకవి "కదలుమిటమాని దివిజగంగా భవాని ” యని మొలలోతునీళ్ళలో నిలువఁబడి చేతులు జోడించి తడిబట్టలతోఁ-- గుంచిత భూయుగ్మముతో- నొనర్చినపార్థనాపూర్వక మగునాజ్ఞవలె నున్నపద్యము లాతనియుద్రేకస్వరూపమునే కనఁబరచుటలేదా?

ఇవి యన్నియుఁ గావ్యములేలకావు? ఇవియే లిరుక్కు..లని నా తాత్పర్యము. భావగీతములని మనవారు వీనికే పేరుపెట్టియున్నారు. సంస్కృతభావగీతములకును నాటకములకును నడుమ జయదేవుని గీతగోవిందము పుట్టి యా రెండుస్వరూపముల కావ్యములకు నతుకువలె నున్నది. ఇది నాటకము ననవచ్చును. భావగీతము ననవచ్చును.

మనలో భామవేష మని యాడుచుండువీధినాటకము భామా కలాప మందురు. ఇందు సత్యభామ విరహవేదన మితవృత్తము. ఇది యక్షగానరూపమున సున్నను, దీనినిఁ బెద్దభావగీత మనవచ్చును. ఇందలి భావోద్రేకము “పదపద్మములు తడఁబడ సాగె నోయమ్మా!" అనుదరువు వినినప్పుడు విశదము కాఁగలదు. అనఁగా భావగీతములు కాని పెద్దకావ్యములనడుమకూడ, వ్రాయుకవి విశ్వరూపము నొందినప్పుడుకాని, తానాపాత్ర మైనప్పుడుకాని- అనఁగా నాపాత్రస్థితికి దిగిపోయినప్పుడు కాని - కవియుద్రేకము నొంది తన్ను తానెఱుఁగకుండఁ కొన్నిభాగములు వ్రాయవచ్చును. అట్టిభాగములలో "లిరిక్కు”ద్భవించిన దని చెప్పవచ్చును. భామాకలాపమునందు స్వభావసిద్ధమైనపత్రలేఖనాదు లున్నను, వీధినాటకప్రదర్శనమునందుఁ బకృతికాంత గుగ్గిలవు పొడులపొగలలో కన్నులుమూసికొని, హరిదళపుఁగంపులకు ముక్కు బిగించుకొని, దరువులచప్పుడులో చెవిటిదియై, గంతులచిందులలోఁ