పుట:Shathaka-Kavula-Charitramu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(xiii)


దయ, మొదవింపఁగలఁడు. తాను చేయుపని నిర్ణయించుకొనును. ఇక్కడ నీరూప మీవిధముగ ప్రదర్శించినఁ జూపరులయం దీరస ముప్పొంగునని చిత్రించును. అది చిత్రించునపు డతని కారస ముదయింపవలె నని శాసనములేదు. చూపరుల కొదవించు నేర్చున్నదా? లేదా? యనియే వివారించెదము. కావ్యమట్లే కవియొకపంథవేసికొని, కావ్యాంతముతానెఱిఁగి, లోకముకొఱకుద్దేశ పూర్వకముగ నిర్మించును. తత్తదుచితస్థలముల నుచితరసము లుద్బవిల్లునట్లు ప్రయత్నించును. భావగీతమునందుఁ గవి యదివ్రాయునప్పటికి రససముద్రములో మునిఁగి యుండవలెను. పులకాంకురములతోడనో, కన్నీళ్లతోడనో, తాను వ్రాయునది తా నెఱుఁగకుండ లక్ష్యలక్షణసమన్వయ మొనర్పలేనంత యొడలు తెలియనిస్థితిలో వ్రాయవలెను. లేనియెడల నాయభిప్రాయముచేఁ గావ్యమునందువలె "సాగుడుకథ” లేకుండుటతప్ప, కావ్యమునకు భావగీతమునకు భేదమే నిరూపింప వీలులేదు. ఆంగ్లేయమున “లైరు”(Lyre)శ్రుతి సహాయమునఁ బాడువానికి లిరిక్కులందురు.అట్టివి మనకీర్తనలు పాటలు మున్నగునవి. ఐనఁ బెద్దలు చర్చించెదరుగాక !

సంస్కృతమునందున్న ట్లే మనకుఁగూడ భక్తిపూరితపద్యములు, పాటలు, కృతులు, శతకములు ననేకము లున్నవి. తెలుగులో లిరిక్కులకుఁ బ్రత్యక్షనిదర్శనములఁ గొన్నిఁటినిఁ జెప్పెదను.

(1) చిన్నతనమునందే వైధవ్యము నొందిన బుద్దిరాజువారి చిన్నది చెప్పినపద్యము లగునవికొన్ని చదువుదురు. ఇవి కరుణరస పూరితములై శ్రోతలకుఁ గన్నీ ళ్లొదవించును. ఇం దాబాలికకన్నీళ్ళు పద్యముతో మనమనోరంగముల రాలుచున్నట్లు తోఁచును. ఈమె దని చెప్పుపద్యము"అయ్యలరాజు రామభద్రుని సకల నీతి కథాసారమునందు నలరాజుకథలో దమయంతివిరహమునఁ”గలదు.

(2) శ్రీనాథుఁడు సర్వజ్ఞసింగభూపతి కొలువున సరస్వతీకనక విగ్రహమును జూచుటతోడనే చేతులుజోడించి, కన్నులుమూసికొని, చెప్పిన “దీనారటంకాల” పద్యమునందు రాజసుతి, అత్మస్తుతియుఁ